ETV Bharat / city

'సంక్షేమ పథకాలకు ఇచ్చినట్టే పెంచిన పన్నులకు ప్రకటనలు ఇవ్వండి' - పన్నుల పెంపుపై సీపీఐ రామకృష్ణ

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటనలిచ్చే వైకాపా ప్రభుత్వం..ప్రజలపై మోపుతున్న పన్నుల భారాలపై ఎందుకు ప్రకటనలు ఇవ్వటంలేదని సీపీఐ రామకృష్ణ సీఎం జగన్​ను ప్రశ్నించారు. ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని మండిపడ్డారు.

cpi ramakrishna fire on jagan govt over taxes
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Jan 7, 2021, 3:05 PM IST

ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యనించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై సుమారు 30 వేల కోట్ల పన్నుల భారాన్ని వైకాపా ప్రభుత్వం మోపుతుందని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటనలిచ్చే వైకాపా ప్రభుత్వం..ప్రజలపై మోపుతున్న పన్నుల భారాలపై ఎందుకు ప్రకటనలు ఇవ్వటంలేదని ప్రశ్నించారు.

లౌకిక పార్టీగా అధికారంలోకి వచ్చిన వైకాపా ఆలయాల్లో దేవుడి విగ్రహాలపై దాడులు జరుగుతుంటే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అధికారులకూ కులాన్ని ఆపాదించిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందన్నారు. పన్నుల పెంపునకు నిరసనగా.. భోగి రోజున పన్నుల పెంపు జీవో కాఫీలను భోగిమంటల్లో వేసి తమ నిరసన సెగను ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామన్నారు.

ఇదీచదవండి

కిడ్నాప్​ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్​విల్ కోసమే బెదిరింపులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.