కరోనా కట్టడిలో రాష్ట్రాలు విఫలమయ్యాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుపట్టారు. మోదీ నాయకత్వంలోనే కరోనా కట్టడి సాధ్యమైందని గతంలో తీర్మానం చేసిన భాజపా.. ఇప్పుడు రెండో దశ కరోనా కట్టడిలో రాష్ట్రాలు విఫలమయ్యాయని మాట్లాడుతోందని విమర్శించారు. ఇది ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి వైరస్ను తుదముట్టించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రజలు ఆనందయ్య మందు కోసం ఆసుపత్రులు ఖాళీ చేసి మరీ బారులు తీరారని రామకృష్ణ అన్నారు. ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.. 13 జిల్లాల్లోని కరోనా బాధితులను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఇదీ చదవండి:
'రెండో విడత కరోనా వ్యాప్తిపై హెచ్చరించినప్పటికీ.. పెడచెవిన పెట్టారు'