కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం గుడ్డిగా మద్దతు ఇస్తుందని సీపీఐ నేత రామకృష్ణ, ఆరోపించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం మీటర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించకూడదా? అని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ నుంచి దశలవారీగా తప్పుకొనేందుకే నగదు బదిలీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు