విజయవాడ నగర పరిధిలోని పాయకాపురం, శాంతినగర్ రెడ్ జోన్ ప్రాంతాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు సందర్శించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తీసుకుంటున్న భద్రత చర్యలను పరిశీలించారు. నగర వ్యాప్తంగా ఆరు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సీపీ అన్నారు. నిత్యావసర సరకులు, కూరగాయలు అవసరాలకై త్వరలో మొబైల్ దుకాణాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నగర వాసులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. లాక్డౌన్ నిబంధనల కొంతమంది అతిక్రమిస్తున్నారని.. వారిపై కేసులు నమోదు చేస్తున్నామని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: పోలీస్ ఆర్కెస్ట్రా: లాక్డౌన్లో వినోదం హోమ్ డెలివరీ