దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సుకు వెళ్లిన నగరవాసుల వివరాలు సేకరించామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 27 మంది నగరవాసులు ఈ సదస్సులో పాల్గొన్నట్లు గుర్తించామని చెప్పారు. కుటుంబసభ్యులతో కలిపి 50 మందిని క్వారంటైన్ సెంటర్లకు తరలించామన్నారు. కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని సీపీ విడుదల చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ప్రజల్లో తిరగొద్దని సూచించారు.
ఇవీ చదవండి: దేశంలో నిజాముద్దీన్ కల్లోలం- కరోనా కేసులు పెరుగుతాయా?