ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిబ్బందికి, ఉద్యోగులకు ఏర్పాటు చేసిన కొవిడ్ వేక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. వ్యాధి నిరోధక శక్తి పెంపుదలకు ఎంతో దోహదపడే టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 55 వేల మందికి కొవిడ్ వాక్సినేషన్ చేసినట్టు తెలిపారు.
టీకా తీసుకున్నా.. ప్రాథమిక ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయాల పరిధిలో వేక్సినేషన్ ఏర్పాటు చేశామన్నారు. లాక్డౌన్ విధిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. ఈ విషయంపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇటువంటి తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు ముందుకొచ్చి... తమ సిబ్బందికి టీకా ఇప్పించాలని కోరడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. తొలిరోజు మొత్తం 45 మంది సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు మధుసూదనరావు తెలిపారు.
ఇదీ చదవండి: