కొవిడ్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ భాస్కర్ కాటంనేని వ్యాక్సిన్ పంపిణీకి తీసుకుంటున్న చర్యలను వివరించారు. 'రాష్ట్ర జనాభా 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున ఇవ్వాలంటే.. 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అవుతుంది. ప్రస్తుతం 3,76,148 లీటర్ల వ్యాక్సిన్‌ను నిల్వ చేసే సదుపాయాలున్నాయి. తొలి విడతలో వ్యాక్సిన్‌ను 3.7 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి ఇస్తారు. రెండో విడతలో మున్సిపల్, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, ఇతరశాఖల ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు 9 లక్షల మందికి ఇస్తారు. మూడో విడతలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 90 లక్షల మందికి, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మిగిలిన వారికి ఇచ్చేందుకు అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ పంపిణీకి 7,459 ఉప ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేస్తున్నాం' అని వారు వివరించారు. డ్రైరన్ సందర్భంగా కొవిన్ యాప్‌లో తలెత్తిన సమస్యలపైనా కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీలో లోటుపాట్లకు అవకాశం ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: