విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా విమానాశ్రయం ఆవరణ లోపలికి కేవలం ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. కారులో వచ్చే ప్రయాణికుడితో పాటు డ్రైవర్‌ను మాత్రమే అనుమతించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణికులకు మాత్రమే నిర్వహించే కొవిడ్ నిర్ధారణ పరీక్షలను.. నేటి నుంచి దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు సైతం విమానాశ్రయంలోనే నిర్వహించనున్నారు. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రయాణికుడ్ని క్వారంటైన్‌కు తరలించాలంటూ క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు అందాయి.
ఇదీ చదవండి: ఇవాళ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే