ఒడిశా నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొవిడ్ కమాండ్ కంట్రోల్ అధికారి కృష్ణబాబు తెలిపారు. గన్నవరం నుంచి అక్కడకు ఖాళీ ట్యాంకర్లు పంపుతున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా వేగవంతానికి విమానాల ద్వారా తరలింపు చేపట్టినట్లు చెప్పారు. వాయుసేన సాయం కోసం సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి
రాష్ట్రానికి కేంద్రం నుంచి 110 టన్నుల కేటాయింపు ఉన్నట్లు కృష్ణబాబు చెప్పారు. రోజూ 40 టన్నులే తెచ్చుకోగలుగుతుండటం పట్ల విచారం వ్యక్తం చేశారు. రేపు మరో 2 ట్యాంకర్లను ఆంగుల్‌కు పంపిస్తామని తెలిపారు. ట్యాంకర్లు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 వేల మంది కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి:
ఇద్దరు కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ అందకనే అంటున్న బంధువులు!