రాష్ట్రానికి మరో 4.08 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చాయి. పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. టీకాలను ప్రత్యేక కంటైనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. రాష్ట్ర వ్యాధి నిరోధక టీకా కేంద్రం ఇన్ఛార్జ్ దేవానందం, ఆరోగ్య శాఖ రాష్ట్ర జేడీ శ్రీవారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుండగా మరిన్ని టీకాలు చేరుకున్నాయి.
ఇదీచూడండి: 'ఉద్యోగి ఒప్పుకుంటేనే డిప్యూటేషన్...ఎస్ఈసీకి వెళ్లలేం'