ETV Bharat / city

కరోనాను తరిమికొట్టలేమా? సాధ్యమే.. మరి ఎలా? - భారత్​లో కరోనా కేసులు న్యూస్

కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతం అయ్యేదికాదు. దీర్ఘకాలిక పోరు సాగించాల్సి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా అందరూ చెబుతున్నారు. ప్రధాని మోదీ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అలాగని ఈ మహమ్మారిని అసలు పారద్రోలే అవకాశం లేదా? మనతోపాటే ఉన్నా మనకు దగ్గరకు రాకుండా చేయలేమా? అంటే .. ఎందుకు చేయలేం.. అన్న సమాధానం వస్తుంది.

కరోనాను తరిమికొట్టలేమా? సాధ్యమే.. మరి ఎలా?

author img

By

Published : Jul 14, 2020, 9:04 AM IST

గతంలో ఎన్నో మహమ్మారులను ఎదుర్కొన్న మానవాళి ఇప్పుడు కరోనాపై కూడా తప్పక విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఎలాంటి పనికైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతమవుతుంది. అలాగే ఇప్పుడు కరోనాపై పోరులో కూడా ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అంటున్నారు. వారి భాగస్వామ్యం లేకుండా మహమ్మారిని తరిమికొట్టడం కష్టమేనని అంటున్నారు. అంటే ఇప్పుడు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ మహమ్మారిని అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. స్వీయ రక్షణతోపాటు సామాజిక భద్రతను గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే మనతోపాటు భవిష్యత్‌ తరాల వారు ఆరోగ్యవంతమైన జీవనం గడపగలరు.

కరోనాను తరిమికొట్టలేమా? సాధ్యమే.. మరి ఎలా?

మెుండిగా ఎదుర్కోవలసిందే

కరోనాతో కంటిమీద కునుకులేదు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. వైరస్‌ సోకిన వారిని చూసి .. అయ్యో అని జాలిపడటం తప్ప చేయగలిగిందేం లేదు. దగ్గరి బంధువులే కాదు సొంత ఇంట్లోని వారికి సోకినా సాయం అందించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటూనే నిత్యం ఆందోళనతో బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది ఉన్నప్పటికి.. ఎవరికి వారు.. ఒంటరితతనాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు. అలాగని జీవనపోరాటాన్ని కొనసాగించక తప్పదు . మొండిగా మహమ్మారిని ఎదుర్కోవలసిందే.

ఇలాంటి మహమ్మారులను ఎన్ని చూడలేదు. వాటితోపాటే ఇదీను అనుకొని ముందుకు సాగాల్సిందే. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవాలంటే సానుకూల దృక్పథం ఎంతో ముఖ్యమైనది. అప్పుడే దాన్ని గట్టిగా ఎదుర్కోగలం. పూర్తి స్థాయిలో మందులు టీకాలు వచ్చే సమయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అందుకే చాలామందిలో ఆందోళన నెలకొంది. అయినా గాని వైరస్‌పై పోరు కొనసాగుతునే ఉంది. విజయం సాధించేవరకూ వెనకడుగు వేసేదే లేదన్నట్టుగా వైరస్‌పై ప్రభుత్వాలు యుద్దాన్ని ప్రకటించాయి. అయితే ఈ యుద్దంలో గెలవాలంటే ప్రభుత్వాలు మాత్రం సన్నద్ధంగా ఉంటేచాలదు అందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం.

గాలి ద్వారనూ.. వైరస్!

ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కరోనాపై పోరాటం ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే శతాబ్దకాలంలో కనీవినీ ఎరుగనంతటి ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రజల వైపునుంచి వచ్చే స్పందనే ఆందోళన కలిగిస్తోంది. గట్టిగా తుమ్మితే, దగ్గితే వచ్చే పెద్దతుంపర్లతోనే కరోనా వైరస్‌ ఇతరులకు సోకుతుందని ఇప్పటిదాకా చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మాట్లాడినప్పుడు వచ్చే సూక్ష్మ తుంపర్లతోనూ ముప్పు తప్పదని చెబుతోంది. గాలి ద్వారానూ వైరస్‌ వ్యాపించే ప్రమాదాన్ని గుర్తించడం కొత్త ఆందోళనకు కారణమయింది.

చెబుతున్నా.. పట్టించుకోరే..

దగ్గు, తుమ్ములద్వారా ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా కట్టడిచేసే లక్ష్యంతోనే లాక్‌డౌన్‌ విధించారు. ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, మ్యూజియాలు, వ్యాయామశాలలు తదితరాల్ని మూసివేతకు ప్రధాన కారణమదే. ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కొన్నాళ్లుగా జనసామాన్యంలో నిబంధనల ఉల్లంఘన ఎక్కువవుతోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని పదేపదే చెబుతున్నా పట్టించుకునే వారేరి. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలోనూ కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారని, అటువంటివారూ మాస్కులు ధరించకుండా తిరగడం వల్లే.. వైరస్‌ వ్యాప్తి జోరందుకోడానికి ముఖ్యకారణంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్నఇలాంటి వైఖరే పరిస్థితి చేజారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ప్రజల భాగస్వామ్యం కీలకం

వైరస్‌ ఉనికిని చాటుకున్న తొలినాళ్లలోనే దీనిపై పోరాటానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లాంటి జనసాంద్రత అధికంగా దేశంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని పేర్కొంది. వైరస్‌ సమూహ వ్యాప్తి దశలో రాకుండా ఉండేందుకు ప్రజల భాగ స్వామ్యంతో ఆ దశకు చేరకుండా ఆపవచ్చని తెలిపింది. ఒకటి రెండు దశలను దాటి మూడో దశలోకి ప్రవేశించినప్పుడు అంటే సామూహిక వ్యాప్తి లోకి ప్రవేశించినప్పుడు పరిష్కారం కూడా అక్కడి నుంచే రావలసి ఉంటుందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎప్పుడైతే ప్రజల్లో ఈ బాధ్యతను గుర్తిస్తారో అప్పుడు వారే వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందుకు వస్తారని తెలిపింది.

అక్కడున్న అవకాశలు.. ఇక్కడ లేవు

ప్రస్తుత పరిస్తితుల్లో కరోనా వైరస్‌పై పోరాటానికి భారతదేశం తనదైన పద్ధతులు ఎంచుకోవాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ సీడీడీఈపీకి చెందిన నిపుణుల అభిప్రాయం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న అవకాశాలు మనకు లేవని.. పైగా ఇక్కడ ఎక్కువమంది రోజువారీ వేతనాలతో జీవితం నెట్టుకొచ్చేవారే. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతర దేశాలకు పూర్తిగా భిన్నమైన పద్ధతులు అనుసరించాలని అంటున్నారు. ఈ ఉపద్రవం ఇప్పటికిప్పుడే తొలగిపోయేది కాదు, దీనిపై కొంతకాలం పాటు యుద్ధం చేయాల్సిందేనన్నది వారి అభిప్రాయం.

98 శాతం బాగవుతారు

మనదేశ వైద్యరంగం కరోనాను నియంత్రించేందుకు అవసరమైన శక్తియుక్తులను ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సమకూర్చుకుంటుంది . ఈ ప్రాణాంతక వైరస్‌ను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలు బాగానే ఉన్నాయి. అయితే ప్రజల పూర్తిస్థాయి భాగస్వామ్యం లేకపోతే దీనిపై విజయం సాధించడం కష్టమే నని అంటున్నారు సీడీడీఈపీకి చెందిన నిపుణులు. ముఖ్యంగా ప్రధానంగా కరోనా చుట్టూ ఉన్నభయం నుంచి బయటపడాలి. ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ వైరస్‌ సోకినవారిలో 98శాతం బాగవుతారు, సురక్షితంగా ఉంటారు. సమస్య తీవ్రతను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం, పరిశుభ్రత విషయంలో స్థానిక సంస్థలతో సహా అందరినీ భాగస్వాములను చేయడం ఇలా ప్రతి ఒక్కరూ సంక్షోభ సమయంలో తాము నిర్వహించాల్సిన పాత్రను గుర్తించాలి. అప్పుడే వైరస్‌పై పోరాటంలో విజయం సాధించగలుతాం.

మార్పులు తేవాల్సిన అవసరం ఉంది

కరోనా సంక్షోభం ఎప్పటికి సద్దుమణుగుతుందని అంచనా వేయడం చాలా కష్టం. దేశంలో ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాలి. అందరూ చేతనైనంత సాయం చేయడం ఇప్పుడు ప్రధాన కర్తవ్యం. మన స్నేహితులు, చుట్టుపక్కలవారు, అసలు మనకు తెలియనివారు... ఇలా అందరికీ మనం అండదండలు అందించినప్పుడు దీనినుంచి బయటపడగలం. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ ఎత్తి వేసి నిబంధనలు సండలించడవల్ల పరిస్థితులు అదుపులో లేవు .ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు మరింత ధైర్యంగా ఉండి తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని.. మహమ్మారిని కట్టడి చేసే వ్యూహాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని అంటున్నారు ప్రజారోగ్య వైద్యనిపుణులు.

ఇదీ చదవండి: కరోనాపై పోరు: 2021 నాటికైనా వ్యాక్సిన్‌ వచ్చేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.