ETV Bharat / city

సినిమా థియేటర్లకు పునర్వైభవం సాధ్యమేనా..! - కరోనా ఎఫెక్ట్

సినిమా చూస్తే భారీ తెరపైనే చూడాలి.. వెండితెరకు ఎన్ని ప్రత్యామ్నాయాలు వచ్చినా థియేటర్లో కూర్చుని చూసే ఆనందం వేరు. కాని కరోనా ప్రభావంతో అంతా తలక్రిందులైంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ సడలింపు ఇచ్చినా థియేటర్లు తెరిచేందుకు మాత్రం ప్రభుత్వాలు అంగీకరించడంలేదు. మరో వైపు వెండితెరకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వేదిక కూడా దూసుకు వస్తోంది. కొన్ని సినిమాలు అయితే నేరుగా నెట్‌లోనే విడుదల అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కరోనా పోయినా థియేటర్లకు పునర్ వైభవం సాధ్యమేనా అన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి.

CORONA EFFECT ON CINEMA THEATERS
సినిమా థియేటర్లపై కరోనా ప్రభావం
author img

By

Published : Jul 5, 2020, 6:04 AM IST

సినిమా థియేటర్లపై కరోనా ప్రభావం

ఇంట్లో హోం థియేటర్ ఉన్నా ..ధనవంతుల ఇళ్లలో మాదిరిగా సొంతంగా థియేటర్లు ఉన్నా.. బయట ఉన్న థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే అనుభూతి వేరు. పొద్దంత కష్టపడిన శరీరానికి ..మనసుకు కాస్తంతా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సినిమాలు. కుటుంబంతో కలిసో.. లేదంటే స్నేహితులతో కలిసి.. వెళ్లి చూడటంలో ఉన్నమజా వేరు. ఏం పాలుపోవడం లేదంటే ..పదండి సినిమాకు వెళ్దాం.. అన్న రోజులు పోయాయి. ఎందుకంటే కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఒకవేళ తెరిచినా.. గతంలోలా చూసే అవకాశం ఉండక పోవచ్చు.

కరోనా పోయేదెప్పుడు.. బొమ్మపడేదెప్పుడు.....

ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో షూటింగ్‌లకు అనుమతిచ్చినా .. మరికొన్ని చోట్ల వాటికి అనుమతి లేదు థియేటర్ల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. సినిమా ధియేటర్ల పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఒక వేళ తెరిచినా..ప్రజలు థియేటర్లకు వస్తారో లేదో.. అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ధియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ..కరోనాకు వ్యాక్సిన్ వచ్చి ప్రజల్లో ఉన్న భయం తొలగిపోతే తప్ప.. సాధ్యం కాదని యాజమాన్యాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం అనుమతులు ఇస్తే చేయాల్సిన ప్రక్రియపై థియేటర్ల యజమానులు సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. సీట్ల మధ్య దూరం, ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్, శానిటైజేషన్, భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడతామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ..కరోనా వ్యాప్తి కారణంగా సినిమా ధియేటర్లు తెరిచేందుకు ఇప్పట్లో అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని.. ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఒక వేళ ధియేటర్లు తెరిచినా.. 25 శాతం కూడా ఆదాయం వచ్చే సూచనలు.. కనిపించడం లేదని యజమానులు చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు సీట్లు తొలగించడం, హాల్ లో మార్పులు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. ఆ దిశగా వెళ్లకుండా.. వ్యక్తిగత సిబ్బందితో ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా ..మరో ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. అయితే ఇదంతా లాక్ డౌన్ ఎత్తివేశాక.. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు.. అనుగుణంగా చేసుకుంటామని పేర్కొంటున్నారు.

వినియోగదారుల చూపు ఓటీటీ వైపు...

మరోవైపు లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు మూత పడడం వల్ల ..ఇదే సమయంలో అన్ లైన్ వైపు ప్రేక్షకుల దృష్టి మళ్ళింది. మొన్నటి వరకూ ఓటీటీ పై అంతంత మాత్రంగా ఉన్న ఆదరణ ఒక్కసారిగా పెరిగింది. ధియేటర్లో విడుదల కావాల్సిన సినిమాలు ఇలాంటి వేదికలపై విడుదలవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ప్రస్తుతం.. ఎల్ ఈడీ టీవీలున్నాయి. వీటికి తోడు ఏదో ఒక ఓటీటీ సంస్థ సభ్యత్వం ఉంటే చాలు ఇంట్లో ఉండి సినిమాలు చూడొచ్చు.

2010 నుంచి 2020 కి పోల్చి చూస్తే ఓటీటీ వినియోగదారులు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ ధియేటర్ల యజమానులు మాత్రం.. చిన్న సినిమాలు తప్ప.. బాహుబలి లాంటి పెద్ద సినిమాలు.. ఓటిటి లో చూసి సంతృప్తి చెందే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లు లేక పోవటం వల్ల.. ఓటీటి వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప.. మళ్ళీ సాధారణ పరిస్థితులు వస్తే మాత్రం ఎప్పటిలాగా థియేటర్లకు వస్తారని చెబుతున్నారు. కానీ ఎంతో కొంత ఓటీటీ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గత వైభవం రావాలంటే...

ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలు వెండితెరపై విరుచుకుపడే అవకాశం ఉండటం వల్ల.. మళ్లీ థియేటర్ల వ్యవస్థకు పునర్వైభవం రావాలంటే అందులో ఉన్న కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకోవాలని.. పరిశ్రమకు,నిర్మాతలకు నష్టంకలిగించేలా ఉన్న.. కొన్నిపాతపద్ధతులను ప్రక్షాళన చెయ్యాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ మాదిరిగా తెలుగు సినీ పరిశ్రమ కూడా అటు ఓటీటీలను.. ఇటు థియేటర్లను సమన్వయపరుచుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ ముందుకు సాగాలని అంటున్నారు. అలాగే సింగిల్ స్క్రీన్ ప్లేసులో మల్టి స్క్రీన్స్ వస్తేనే పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు.

సినిమా పరిశ్రమలో థియేటర్లు పోషించే పాత్ర....మొత్తం ఆ వ్యవహారంలోనే కీలకం. నెలలు, సంవత్సరాలు నానా ఇబ్బందులు పడి...తీసే సినిమా... ప్రేక్షకుడికి చేరువ కావాలంటే... అందులో థియేటర్ల పాత్రే కీలకం. ఎన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్​లు అందుబాటులోకి వచ్చినా....హాల్​లో కూర్చుని సినిమా ఎంజాయ్ చేస్తుంటే వచ్చే మజాయే వేరని.. చాలా మంది ప్రేక్షకులు చెబుతున్న అభిప్రాయం. ఆ స్థాయిలో సగటు ప్రేక్షకుడితో పెనవేసుకుని పోయినా సినిమా హాళ్ల బంధం...కరోనా కారణంగా బలహీనమైపోయింది. థియేటర్లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితిలో దానిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలన్నీ దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాయి.

ఇవీ చదవండి: కరోనా కాటుతో వెలవెలబోతున్న వెండితెర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.