ETV Bharat / city

ఏపీఎస్​ఆర్టీసీలో కరోనా కలకలం.. 72 మంది మృతి

ఇప్పటి వరకు 4500 మంది ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డట్లు ఆ సంస్థ ప్రకటించింది. 72 మంది మరణించినట్లు తెలిపింది. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.

Corona Effect On APSRTC Staff
ఏపీఎస్​ఆర్టీసీలో కరోనా కలవరం.. 72 మంది మృతి
author img

By

Published : Sep 29, 2020, 11:33 PM IST

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్​ఆర్టీసీ సిబ్బందిలో కరోనా కలవరం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 4500 మంది ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డట్లు సంస్థ ప్రకటించింది. కరోనా కారణంగా 72 మంది మరణించినట్లు తెలిపింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. కార్మికుల ఒక రోజు వేతనాన్ని జమ చేసి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని తెలిపారు.

కరోనా బారిన పడకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఎండీ ఆదేశించారు. సిబ్బంది మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగం సహా... భౌతికదూరం తప్పక పాటించాలని సూచించారు. కరోనా బారినపడిన వారిని వెంటనే వైద్య కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని ఆదేశించారు. సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారిన పడుతోన్న దృష్ట్యా.. వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉద్యోగులకు రొటేషన్ పద్దతిలో డ్యూటీలు వేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. బస్​స్టేషన్లలో దుకాణాల అద్దె మాఫీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మార్చి 22 నుంచి జూన్ 7 వరకు బస్సులు నడవనందున... అద్దెమాఫీ చేస్తున్నట్ల ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన దృష్ట్యా అన్ని బస్సుల్లో మునుపటిలా యథాస్థానానికి మార్చి పూర్తి స్థాయిలో సీట్లు కేటాయించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి నడపాల్సిన బస్సుల సంఖ్యను పెంచాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.