ETV Bharat / city

కరుణ లేని కరోనా.. తెగుతున్న బంధాలు.. కుమిలిపోతున్న అనుబంధాలు! - ఏపీలో కరోనా మృతులు న్యూస్

కరుణ లేని కరోనా.. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటూనే ఉంది. ఆ మహమ్మారి ధాటికి బంధాలు తెగుతున్నాయి.. అనుబంధాలు కుములుతున్నాయి.. కొవిడ్‌ తీవ్రమై కొందరు.. ప్రాణవాయువు దొరక్క ఇంకొందరు.. ఆసుపత్రుల్లో పడకలు లభించక మరికొందరు.. ఆదివారం అసువులు బాశారు.

corona-deaths-in-andhrapradesh
corona-deaths-in-andhrapradesh
author img

By

Published : Apr 26, 2021, 7:10 AM IST

ఐదున్నర గంటలు.. 4 ఆసుపత్రులు

కరోనా బారిన పడి గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లివాసులను కంటతడి పెట్టించింది. పట్టణానికి చెందిన వ్యాపారి చిన్నకుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమెకు సహోద్యోగితో ఆగస్టులో వివాహం చేసేందుకు నిర్ణయించారు. వ్యాపారి కుటుంబం ఇటీవల విజయవాడలో షాపింగ్‌ చేశారు. ఆరు రోజుల కిందట జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో దంపతులిద్దరూ స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని అక్కడి వైద్యులు చెప్పడంతో శనివారం సాయంత్రం అంబులెన్స్‌లో ఇద్దరినీ బంధువులు గుంటూరు తరలించారు. విదేశాల్లో ఉన్న కుమార్తెలు అక్కడి నుంచే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకల కోసం ప్రయత్నించారు. ఒక పడక దొరకడంతో వ్యాపారి (60)ని చేర్చారు. ఆయన భార్య (54) అత్యవసర వైద్యసేవలకు బంధువులు నాలుగు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఐదున్నర గంటల పాటు ఆమె అంబులెన్స్‌లోనే ఉన్నారు. రాత్రి 11 గంటలకు గుంటూరు సర్వజనాసుపత్రిలో పడక దొరికింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త కూడా కన్నుమూశారు. వీరిది ప్రేమ వివాహం.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. స్థానికంగా ఎన్నో సేవాకార్యక్రమాలు, సహాయాలు చేసేవారని గుర్తుచేసుకుంటూ పట్టణవాసులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులను కడసారి చూసేందుకూ కుమార్తెలు రాలేని దయనీయ పరిస్థితి.

కుమారుడి మృతితో ఆగిన తండ్రి గుండె

ఓ ఉపాధ్యాయుడు కరోనాతో చనిపోగా... తట్టుకోలేక తండ్రి గుండె ఆగి మరణించిన విషాదమిది. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజారావు(54) కుమారుడి వివాహం మే 13న జరగాల్సి ఉంది. అందుకోసం శుభలేఖలు పంచుతూ రాజారావు కరోనా బారిన పడ్డారు. ఆయనను విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. రాజారావు మృతి విషయాన్ని మధ్యాహ్నం వరకూ తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎట్టకేలకు తండ్రి సుబ్బారావు(88)కు విషయం తెలియడంతో తట్టుకోలేని ఆయన గుండెపోటుతో మధ్యాహ్నం చనిపోయారు.

పడకలు దొరక్క.. మృత్యువాత

చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో పడకలు దొరక్క వారం వ్యవధిలో కరోనా వల్ల తల్లీకుమార్తెలు చనిపోయిన విషాదమిది. విశాఖపట్నంలోని జ్ఞానాపురానికి చెందిన చోడిపల్లి సరస్వతి(45)కి ఇటీవల కరోనా సోకింది. ఎంత ప్రయత్నించినా ఆసుపత్రిలో పడక లభించక ఇంట్లోనే ఉంచి వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి గత ఆదివారం(18న) చనిపోయారు. కుమార్తెకు సేవలు చేసిన తల్లి లక్ష్మి(65)కీ నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ఆమెకూ ఆసుపత్రిలో పడక లభించక కంచరపాలెం సమీప దుర్గానగర్‌లోని ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించగా విమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పడకలు ఖాళీలేక మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అర్ధరాత్రి దాటాక లక్ష్మి మృతి చెందినట్లు కుటుంబీకులు చెప్పారు.

ఆసుపత్రిలోనే... ఆత్మహత్య

కరోనా బాధితుడొకరు ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. పాతనగరం కోటవీధికి చెందిన సునీల్‌కుమార్‌(34) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేక వారం కిందట కొవిడ్‌ పరీక్షలు చేయించకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తీవ్ర మనోవేదనతో ఆదివారం ఉదయం ఆసుపత్రిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు.

గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతి

కరోనాతో గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. పెదకూరపాడుకు చెందిన జిల్లా తెదేపా కార్యదర్శి అర్తిమళ్ల రమేష్‌ భార్య మాజీ సర్పంచి నళిని(52) కరోనా లక్షణాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. అదే గ్రామంలో నివసించే నళిని తల్లి లక్ష్మీరాజ్యం(74) కూడా గుంటూరులోని మరో ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​ ప్రమాదంలో 11కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.