హైదరాబాద్ మహానగరంలో వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న అధికార సిబ్బంది అధికంగా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. జగద్గిరిగుట్టలో ఐదుగురు, నిజాంపేట్‌లో, ప్రగతినగర్‌లో 8 మంది వైరస్ బారినపడ్డారు. శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు పాజిటివ్ నిర్ధరణ అయింది. యూసుఫ్‌గూడ సర్కిల్ -19 పరిధిలో 23 మందికి పాజిటివ్ నిర్ధరణగా తేలింది. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒకేరోజు 19 కొత్త కేసులు వెలుగుచూశాయి.
పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా
రాష్ట్ర పోలీస్ అకాడమీలో అటెండర్‌తో మొదలైన కరోనా కేసుల పంరపర అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం నాటికి మొత్తం 180 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ఐపీఎస్ అధికారితో పాటు ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు అదనపు ఎస్పీలు ఉన్నారు. 100 మంది శిక్షణ ఎస్సైలతో పాటు మరో 70 మందికి పైగా సిబ్బందికి కరోన బారిన పడ్డారు. పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.