ETV Bharat / city

తెలంగాణ: కేసులు పెరుగుతున్నాయ్.. జర భద్రం - సీఎం సమీక్ష

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా కేసులు పెరుగుతుండడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పురపాలక, వైద్యఆరోగ్యశాఖ మంత్రులు ప్రతిరోజూ ప్రత్యేకంగా సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్... అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖకు స్పష్టం చేశారు.

corana-deaths-in-telangana
corana-deaths-in-telangana
author img

By

Published : Apr 13, 2020, 8:13 PM IST

మరో 32 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం వరకు రాష్ట్రంలో 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... సోమవారం మరో 32 కేసులు నిర్ధరణ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులు వివరాలు తెలిపారు. కరోనా వల్ల మరొకరు మృతి చెందినట్లు చెప్పారు. కరోనా నివారణా చర్యలు, లాక్​డౌన్ అమలు తదితర అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.

నగరంపై ప్రత్యేక దృష్టి

కరోనా కేసుల స్థితిని వివరించిన అధికారులు... పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అన్ని లేబరేటరీలు, ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించేలా... ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించిన సీఎం... కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున నగరంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఒక్కో జోన్​ ఒక్కో యూనిట్​

హైదరాబాద్​ను జోన్లుగా విభజించి, ఒక్కో జోన్​ను ఒక్కో యూనిట్​గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ కేసులు నమోదై పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు హైదరాబాద్​లోనే ఎక్కువ ఉన్నందున ప్రత్యేక వ్యూహం అనుసరించాలని స్పష్టం చేశారు. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్​కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలని తెలిపారు. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి తెలిపారు.

రాకపోకలు బంద్ చేయాలి

హైదరాబాద్ నగరానికి మొత్తం ఒకే జిల్లా వైద్యాధికారి ఉండగా... 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారులను నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 246 కంటైన్మెంట్లు ఏర్పాటు చేయగా... ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంట్లు ఉన్నాయని వాటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లోకి రాకపోకలు పూర్తి బంద్ చేయాలని పేర్కొన్నారు. ప్రతి కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించి... అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలని ఆదేశించారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. జనసమ్మర్ధం అధికంగా ఉండే జీహెచ్ఎంసీలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాన్నారు.

వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి

పురపాలక, వైద్య-ఆరోగ్యశాఖ మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు ప్రతి రోజూ ఉదయం ప్రగతి భవన్​లోనే జీహెచ్ఎంసీలోని సర్కిళ్ల వారీ ప్రత్యేక సమీక్ష జరపి... పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నందున ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించి ఇండ్ల నుంచి బయటకు రావద్దని మరోమారు విజ్ఞప్తి చేశారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇదీ చూడండి: కరోనా కలవరం.. రాష్ట్రంలో కొత్తగా 7 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.