ETV Bharat / city

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్

author img

By

Published : Nov 13, 2020, 3:24 PM IST

కాలువలో దూకి మరణించాలనుకున్న ఓ వ్యక్తిని.. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. ప్రాణాలకు తెగించి.. విజయవాడ అజిత్​సింగ్ నగర్ వద్దనున్న బుడమేరు కాలువలో దూకి బాధితుడిని కాపాడాడు. గతంలోనూ ఇదే తరహాలో ఓ వృద్ధురాలి ప్రాణం కాపాడిన పోలీసును స్థానికులు కొనియాడారు.

constable saved a person
కాపాడిన వ్యక్తితో కానిస్టేబుల్

విజయవాడ అజిత్​సింగ్ నగర్ వద్దనున్న బుడమేరు కాలువలో దూకిన ఓ వ్యక్తిని.. బుజ్జిబాబు అనే కానిస్టేబుల్ కాపాడాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు వెంటనే స్పందించి.. నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చాడు. గతంలో జరిగిన ఇదే తరహా సంఘటనలోనూ.. ఓ వృద్దురాలిని బుజ్జిబాబు రక్షించాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిని లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి కాలువలోకి దూకాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని.. గుంటూరుకు చెందిన ఆనందరావుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోవాలనుకున్నానని బాధితుడు తెలిపాడు. అతడిని కాపాడిన కానిస్టేబుల్​ని పలువురు అభినందించారు.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తోన్న రెడీమేడ్ దుస్తులు పట్టివేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.