ETV Bharat / city

కానిస్టేబుల్ కిషోర్ కాపాడింది వ్యక్తిని కాదు.. ఓ కుటుంబాన్ని..! - constable kishore save colleague life at krishna district

ఆపద సమయంలో ఓ కానిస్టేబుల్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి.. పాము కాటుకు గురైన సహోద్యోగి ప్రాణం కాపాడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో జరిగింది.

కానిస్టేబుల్ కిషోర్ సమయస్ఫూర్తి
కానిస్టేబుల్ కిషోర్ సమయస్ఫూర్తి
author img

By

Published : Aug 21, 2021, 9:32 PM IST

ఆందోళనకర స్థితిలోనూ సమయస్ఫూర్తి ప్రదర్శించి సహోద్యోగి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ తీరు.. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కానిస్టేబుల్ కిషోర్.. పాము కాటుకు గురైన సహోద్యోగిని ఆపద నుంచి కాపాడి మన్ననలు పొందుతున్నారు. ముసునూరు పీఎస్​లో శివ కిరణ్, కిషోర్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆ ఇద్దరు.. అర్థరాత్రి రంగంపేట గ్రామం వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పొదలొంచి వచ్చిన పామును చూసి భయపడ్డారు.

బైకు అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. శివ కిరణ్ కాలుపై పాము కాటు వేసింది. ఈ పరిణామానికి షాక్​ తిన్న కిషోర్.. క్షణాల్లో తేరుకొని ద్విచక్రవాహనంపై కిరణ్​ను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.. సకాలంలో తీసుకురావడంతో ప్రాణాపాయస్థితి తప్పిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో సమయస్ఫూర్తి ప్రదర్శించి తోటి ఉద్యోగి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కిషోర్​ను వైద్య నిపుణులు డాక్టర్ డేవిడ్ అభినందించారు.

విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. కానిస్టేబుల్ కిషోర్​ను అభినందించారు. కిషోర్ సమయస్ఫూర్తికి నూజివీడు డీఎస్సీ బి శ్రీనివాసులు ఘనంగా సత్కరించి నగదు రివార్డు అందజేశారు. కిషోర్ కాపాడింది కేవలం తనతోటి ఉద్యోగిని మాత్రమే కాదని.. బాధితుడు శివ కిరణ్​ను నమ్ముకున్న మొత్తం కుటుంబాన్ని అన్నారు.

ఇదీ చదవండి:

Suspicious Death: విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్‌ అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.