విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా శివనాగరాజు విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నివాసముండే ఇంటిపై వెంకటేష్ అనే వ్యక్తి ఉండేవాడు. పరిచయస్థులు కావడంతో శివనాగరాజు భార్యతో వెంకటేష్‌కు చనువు ఏర్పడింది. గుర్తించిన శివనాగరాజు.. వెంకటేష్‌ను హెచ్చరించాడు. ఈ పరిణామాలతో వెంకటేష్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అయినా.. శివనాగరాజు భార్యతో మాట్లాడుతుండేవాడు.
విధి నిర్వహణలో భాగంగా శివనాగరాజు డ్యూటీకి వెళ్లగా.. అతని ఇంటికి వెంకటేష్ వచ్చాడు. గమనించిన ఇంటి యజమాని శివనాగరాజుకు ఫోన్ చేశాడు. అనంతరం గది తలుపులు వేసి, తాళం వేశారు. శివనాగరాజు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత.. గదిలో ఉన్న వెంకటేష్‌ను విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన వెంకటేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. వెంకటేష్‌పై దాడి చేసిన సమయంలో ఇంటి యజమాని దంపతులు అక్కడే ఉన్నా దాడిని ఆపే ప్రయత్నం చేయలేదని పోలీసులు వారిపైనా కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
CSR COLLEGE: ఎయిడెడ్ సంస్థల మూసివేత.. ప్రశ్నార్థకంగా శర్మ కళాశాల భవిష్యత్తు!