కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ సంతాపం ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజనాథ్.. ఆంధ్రరత్న భవన్లో వోరా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలు, నాయకత్వం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ సీనియర్ నేత వోరా కన్నుమూత