విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీ కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, కాంగ్రెస్ నేషనల్ కో-ఆర్డినేటర్ సోనువానే, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బీసీలను గుర్తించిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ వ్యవస్థలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని.. బీసీల హక్కులను సాధించుకునేందుకు ఉద్యమ బాటపట్టాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను విస్మరిస్తే..తగు రీతిలో బుద్ధి చెబుతామని సోనువానే హెచ్చరించారు. చమురు ధరలు పెరుగుతున్నా, రైతులు మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా..కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఓబీసీ విధానాన్ని బలోపేతం చేస్తూ..ఎంపీ, ఎమ్మెల్యే, కౌన్సిల్ పదవుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి...