45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలను ఆదుకునేందుకు వైయస్సార్ చేయూత పథకాన్ని తీసుకువచ్చారని.. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకే పథకాన్ని పరిమితం చేయడం ఎంత వరకు సమంజసమని తులసిరెడ్డి ప్రశ్నించారు. అగ్ర వర్ణాల్లో కటిక దారిద్య్రం అనుభవిస్తున్న వారు ఉన్నారని పేర్కొన్నారు.
వైఎస్సార్ పెళ్లి కానుక పథకం అగ్ర కులాల పేదలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 శాతం ఆర్థికంగా వెనకబడిన అగ్ర కులాల.. పేదలకు రిజర్వేషన్ లేక నష్టపోతున్నారన్నారు. తక్షణమే అగ్ర కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రిజర్వేషన్ అమలు జీవో విడుదల చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: