హైదరాబాద్ పాతబస్తీ లలితాబాగ్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ ఆత్మహత్యకు యత్నించారు. నర్కి ఫుల్బాగ్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం లోపల పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించారు.
లలితాబాగ్ డివిజన్లో తనను ప్రచారం చేయనీయకుండా తెరాస, భాజపా, ఎంఐఎం అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈనెల 21న రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. భవానినగర్ ఇన్స్పెక్టర్ ప్రచారం చేయనివ్వకుండా అనుమతులు సక్రమంగా లేవని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయకుండా.. ఇతర అభ్యర్థులకు ఇచ్చారని ఆరోపించారు.
తనకు రిటర్నింగ్ అధికారి కూడా సహకరించడం లేదని, అనుమతుల కోసం గంటల తరబడి వేచిచూసేలా చేసున్నాడని వాపోయాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు ఘటన స్థలికి చేరుకొని.. అభ్యర్థిని ఠాణాకు తరలించారు. చంద్రాయణగుట్ట సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, తెరాస, భాజపా, ఎంఐఎం, రిటర్నింగ్ అధికారిపై.. కాంగ్రెస్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీచూడండి: మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!