నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. వైస్ ఛైర్మన్ శ్రవణ్ కుమార్‌కు చెందిన అభిరామ్ ఇనిస్టిట్యూట్ కోసం 3.19 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మున్సిపల్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెట్టగా వైకాపా కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఫలితంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత వాదోపవాదనలకు దిగటమే కాకుండా దాడులకూ పాల్పడ్డారు. నాయుడుపేట పురపాలక సంఘం సాధారణ సమావేశాన్ని ఛైర్ పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో నిర్వహించారు. వైస్ ఛైర్మన్ షేక్ రఫీ... జరగని పనులు జరిగినట్లుగా నివేదికలు పంపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఎస్సీ ఎస్టీలు లేని ప్రాంతాల్లో ఆ నిధులతో పనులు చేయడం సబబు కాదని సూచించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వాడీవేడి చర్చలతో జరిగింది. గత సమావేశంలో తెదేపా ఇచ్చిన డీసెంట్పై పాలకపక్ష వైకాపా తప్పు పట్టడంతో వాదన తీవ్రంగా సాగింది. తెదేపా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైకాపా, తాము అవినీతిని అడ్డుకుంటామని తెదేపా సభ్యులు వాదులాడుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఆంధ్రరత్న రోడ్డు, ప్రసాద్ థియేటర్ ప్రాంతాలలో 2018లో షాపుల ముందు ఏర్పాటు చేసిన స్టీల్ రైలింగ్‌ను తొలగించే విషయంలో కౌన్సిలర్లు ఆమంచి, కరణం మద్య వాగ్వాదం జరిగింది. ఆందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సమావేశం హాలు నుంచి ఛైర్మన్ బయటకు వెళ్లిపోయారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో సమావేశం జరిగింది. గత కౌన్సిల్ మీటింగ్‌లో వార్డులో ఉన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ అధికారులు... నెల కావస్తున్నా ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించకలేదని సంబంధిత వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తమ వార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీచదవండి.