కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువన పరివాహక గ్రామాల ప్రజలు, మూగజీవాలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ కోరారు. ఎగువ నుంచి నదీ పరివాహక ప్రాంతాలైన పాలేరు, కీసర, మున్నేరు, వైరా, కట్లేరు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి అధికంగా నీరు వస్తోందని తెలిపారు.
ప్రస్తుతం జలాశయంలో 3 అడుగుల లెవెల్‌ను కొనాసాగిస్తూ... 70 గేట్లను ఎత్తి దిగువకు లక్ష 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నది దిగువ పరివాహక గ్రామాల ప్రజలు, మూగజీవాలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: