కరోనా బాధితుల డిశ్చార్జ్, మృతదేహాల అప్పగింతల విషయంలో కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల తీరుపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. జాప్యం చేయడంతో పాటు జులుం ప్రదర్శించటం సరికాదని కలెక్టర్ ఇంతియాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్సలు, అందుతున్న వైద్య సదుపాయాలు, సేవలపై సమీక్షించిన కలెక్టర్.. పలు ఘటనలపై చర్చించారు. ఇటువంటి చర్యలు సహేతుకం కాదని.. వీటిపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: