రమేష్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో 50 వేల గుండె ఆపరేషన్లు, స్టెంట్లు, యాంజియోప్లాస్టీల మైలురాయిని అధిమించిన సందర్భంగా విజయవాడలో సీఎంఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రమేష్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ పోతినేని రమేష్‌బాబు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. ఆధునిక వైద్య విధానాలు, శస్త్రచికిత్సల నిర్వహణ గురించి వైద్య నిపుణులు వివరిస్తారన్నారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి