ETV Bharat / city

రైతు భరోసా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు: సీఎం జగన్

author img

By

Published : Feb 2, 2021, 9:58 PM IST

రైతులకు రక్షణ సహా వారికి జరిగే మోసాలను సత్వరమే పరిష్కరించేలా రైతు భరోసా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాకో రైతు భరోసా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి పోలీసుస్టేషన్ తో అనుసంధానించనున్నట్లు తెలిపారు.

రైతు భరోసా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు: సీఎం జగన్
రైతు భరోసా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు: సీఎం జగన్

రాష్ట్రంలో రైతు భరోసా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, 'దిశ' చట్టం అమలు, ఫోరెన్సిక్ ల్యాబ్​లు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. దిశ చట్టం ప్రకారం మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలన్న సీఎం.. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, దిశ స్పెషల్‌ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్నితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రైతులకు రక్షణగా..

రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలన్న సీఎం..రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో రైతు భరోసా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిలిచి.. వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతులకు భద్రత కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగానే రైతుల కోసం ఒక డెస్క్‌ ఉంటుందన్నారు.

కార్యాచరణ తయారు చేయాలి

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఈ డెస్క్‌లు జిల్లా స్థాయి పోలీస్‌స్టేషన్‌ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచనగా ఉందని సీఎం అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి.. కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్బీకేలు, పోలీసులు అనుసంధానంతో పని చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలామంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారని, అక్కడ వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే చట్టపరంగానూ, వారికి రక్షణగానూ ఈ కొత్త వ్యవస్థ నిలబడాలని సూచించారు. రైతులు మోసాలకు గురి కాకుండా చూడాలి. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే వారికి అండగా నిలవడానికే ఈ కొత్త వ్యవస్థ ఉండాలన్నది ముఖ్య ఉద్దేశమన్నారు.

నేరాలు తగ్గాయి

దిశ చట్టం అమలుకు తీసుకుంటోన్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలని అధికారులకు ఆదేశించారు. దర్యాప్తునకు ప్రక్రియలో మౌలిక సదుపాయాల సమస్యలుంటే దానిపై పూర్తి స్థాయి దృష్టిపెట్టాలన్నారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు కావాలన్నారు. 'దిశ' అమలు, మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక దృష్టి కారణంగా 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

భద్రతా అంశాలంపై హోర్డింగ్స్

471 కేసులకు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేశామని సీఎం అన్నారు. 1080 కేసుల్లో 15 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేశామని.. 103 కేసుల్లో శిక్షలు ఖరారు చేసినట్లు తెలిపారు. సైబర్‌ బుల్లీయింగ్‌పై 15,31 కేసులు పెట్టామన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులతో అనుసంధానం కావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు దిశ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలని నిర్దేశించారు. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని.. వీటికి దిశ పేరే పెట్టాలని సీఎం సూచించారు.

2 గంటలపాటు స్పందన కార్యక్రమం

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి యూనిఫామ్స్‌ నిర్దేశించాలన్న ముఖ్యమంత్రి...ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

ఇదీ చదవండి: నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. రెండు వారాల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.