కరోనా దృష్ట్యా సీఎం సహాయనిధికి ప్రభుత్వం జూనియర్ కళాశాలల ఒప్పంద లెక్చరర్లు రూ.44 లక్షల విరాళం అందించారు. ఐకాస కన్వీనర్ యార్లగడ్డ రాజాచౌదరి సీఎంకు చెక్కు అందించారు.
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే కరోనా సహాయ చర్యలకు విరాళం ఇచ్చారు.
సీఎం సహాయనిధికి విద్యుత్ ఉద్యోగులు రూ.7.87 కోట్ల విరాళం ప్రకటించారు. మంత్రి బాలినేని సీఎం జగన్‌కు విరాళాల చెక్కులు అందించారు.
దివీస్ లేబరేటరీస్ రూ.5 కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించింది. అలాగే ఎన్‌సీసీ లిమిటెడ్ రూ.కోటి విరాళం ఇచ్చింది. వీరు సీఎస్ నీలం సాహ్నీని కలిసి చెక్కులు అందించారు.
ఇవీ చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి