CM Jagan to meet Governor: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం కలవనున్నారు. ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. దిల్లీలో ప్రధాని మోదీ,హోం మంత్రి అమిత్ షాను కలసివచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై నివేదికలను వారికి సమర్పించారు.
ఈ నేపథ్యంలో.. ప్రధాని, హోంమంత్రి ఇచ్చిన ఆదేశాలు తెలుసుకునేందుకు.. సీఎం జగన్.. గవర్నర్ వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా.. గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
ప్రభుత్వాస్పత్రుల్లో కరవైన మందులు, సర్జికల్స్.. రోగులే కొనుగోలు చేసే దుస్థితి..