రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నకిలీ చలానాల కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జగన్.. నిందితుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలన్నారు.
ఇప్పటికే రూ.40 లక్షల మేర సొమ్ము రికవరీ చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు.. సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానిస్తున్నట్లు సీఎంకు వివరించారు.
ఇదీ చదవండి:
FAKE CHALLANS: నకిలీ చలానాల కుంభకోణం..ప్రభుత్వం అంతర్గత విచారణ