ETV Bharat / city

వ్యవసాయశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆర్‌బీకేల ద్వారా మాత్రమే ధాన్యం కొనుగోళ్లు.. - CM Jagan review meeting

CM Jagan Review: ఖరీఫ్ సీజన్‌లో ప్రతి పైరును ఈ క్రాపింగ్ ద్వారా తప్పక నమోదు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ తర్వాత డిజిటల్ రసీదు ఇవ్వాలన్నారు. ఆర్‌బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేయాలని.. మిల్లర్ల పాత్రను తీసేయాలని స్పష్టంచేశారు. పంటలకు తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలని... ఆ బాధ్యత అధికారులు, ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు.

CM Jagan
CM Jagan
author img

By

Published : Jun 27, 2022, 10:17 PM IST

Updated : Jun 28, 2022, 4:14 AM IST

CM Jagan Review: వ్యవసాయశాఖపై సమీక్షించిన సీఎం జగన్‌... ఈ–క్రాపింగ్, ధాన్యం కొనుగోళ్లు అంశాలపై చర్చించారు. ఖరీఫ్‌లో రైతు పండించిన పంటను కచ్చితంగా ఈ–క్రాపింగ్‌ చేయాలని ఆదేశించారు. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు సహా ఎలాంటి కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ–క్రాప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని నిర్దేశించారు. ఈ–క్రాప్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు భౌతికంగానూ రశీదు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. డిజిటల్‌ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలన్నారు.

రైతుకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వస్తుందన్నారు. వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లకు సంయుక్తంగా అజమాయిషీ బాధ్యతను అప్పగించాలన్నారు. సాగు భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలన్నారు. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్‌ ఈ–క్రాప్‌లో లోడ్‌ చేయాలన్న సీఎం.. ఈ క్రాపింగ్‌ ప్రక్రియ ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలన్నారు. సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీ చేపట్టాలన్నారు. ఉన్నతాధికారులు ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్‌పై సమీక్ష చేయాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ఇ–క్రాపింగ్‌ జరిగే తీరును తనిఖీ చేయాలన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలని నిర్దేశించారు.ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ధాన్యం కొనుగోలు బాధ్యత,ఆ తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత పౌరసరఫరాల శాఖదేనన్నారు. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత... ఆ ధాన్యాన్ని వేరే వే–బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలని, దీనివల్ల రైతుకు మద్దతు ధర లభిస్తుందన్నారు. రావాల్సిన గిట్టుబాటు ధరలో ఒక్క రూపాయి తగ్గకుండా రైతుకు రావాలన్నారు. కొనుగోలు చేయడమే కాకుండా మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:CM Jagan: మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్‌

ఆ జాబితాలో కోహ్లీ, బన్నీ టాప్.. తర్వాత ఎవరున్నారంటే?​

అది నడుమా.. నయాగరా జలపాతమా.. కేక పెట్టిస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ..!

Last Updated : Jun 28, 2022, 4:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.