ETV Bharat / city

అవినీతి విభాగాల ప్రక్షాళన.. ఏసీబీ ప్రత్యేక యాప్: సీఎం జగన్ - ఏసీబీపై సీఎం జగన్ సమీక్ష

అవినీతిపై ఫిర్యాదుల స్వీకరణ కోసం నెల రోజుల్లోగా ‘దిశ’ తరహా యాప్‌ను సిద్ధం చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎవరైనా సరే తమ ఫోన్‌ నుంచే అవినీతికి సంబంధించిన ఆడియో, వీడియోలు సహా పత్రాల్ని కూడా అప్‌లోడ్‌ చేయగలిగేలా ఈ యాప్‌ ఉండాలని పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం హోంశాఖపై ఆయన సమీక్షించారు.

అవినీతి విభాగాల ప్రక్షాళన.. ఏసీబీకి ప్రత్యేక యాప్

author img

By

Published : Apr 20, 2022, 5:42 PM IST

Updated : Apr 21, 2022, 3:30 AM IST

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్ర జగన్‌ అధికారులను ఆదేశించారు. హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అనిశాకు ప్రత్యేక యాప్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతి ఫిర్యాదులపై ఏసీబీ దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీకి మధ్య అనుసంధానం ఉండాలన్నారు. యాప్‌ ద్వారా ఏసీబీకి ఎలా ఫిర్యాదు చేయాలనే వివరాలతో పాటు, టోల్‌ఫ్రీ నంబరును గ్రామ, వార్డు సచివాలయాల్లో అందరికీ కనిపించేలా పెట్టాలని చెప్పారు.

మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని వెల్లడించారు. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారాలను చోటు ఉండకూడదని.. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలన్నారు. డ్రగ్స్‌ విషయంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హోమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

"ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అ.ని.శా.కు యాప్‌. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం చేస్తాం. మండల స్థాయి వరకు అ.ని.శా. స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా అ.ని.శా. పర్యవేక్షణ. రాష్ట్రంలో డగ్స్‌ వ్యవహారాలకు చోటు ఉండకూడదు. డ్రగ్స్‌ వ్యవహారాలను కూకటివేళ్లతో సహా తొలగించాలి. డ్రగ్స్ విషయంలో విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు ఏర్పాటు చేయాలి." - జగన్‌, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం

Last Updated : Apr 21, 2022, 3:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.