గవర్నర్ నరసింహన్‌తో పదేళ్లుగా పరిచయం ఉందని సీఎం జగన్ అన్నారు. తనను తండ్రిలా ఆదరించారని జగన్ పేర్కొన్నారు. నరసింహన్‌కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. గవర్నర్గా తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించారన్నారు. సీఎం అయ్యాక తనకు, రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేశారని గుర్తుచేసుకున్నారు. మరింత కాలం నరసింహన్ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తండ్రి స్థానంలో ఉండి ఓ పెద్దాయనగా సలహాలు ఇచ్చారని నరసింహన్ సేవలు గుర్తు చేసుకున్నారు. నిండు మనస్సుతో ఆయన ఆశీస్సులు రాష్ట్రంపై ఉంటాయని భావిస్తున్నాని జగన్ అన్నారు.
ఇదీ చదవండి : ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తా : వీడ్కోలు సభలో గవర్నర్