గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో అరగంట పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారు. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు సీఎం జగన్ వివరించారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం పట్టణాల్లో సమయం కుదింపు సహా వైద్య సదుపాయాల కల్పన, పేదలకు నిత్యావసరాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు సీఎం తెలిపారు.
రాజ్‌భవన్ లోపలికి సీఎం వాహనం మాత్రమే
కరోనా ప్రభావం సీఎం కాన్వాయ్ పైనా పడింది. సాధారణంగా రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి వెళ్లినపుడు సీఎం కాన్వాయ్ మొత్తాన్ని రాజ్‌భవన్ లోపలికి పంపుతారు. కరోనా ప్రభావంతో రాజ్‌భవన్‌లో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈసారి సీఎం జగన్ వాహనాన్ని మాత్రమే లోపలికి పంపారు. మిగిలిన వాహనశ్రేణిని రాజ్‌భవన్ గేటు బయట నిలిపివేశారు. 108 వాహనం, ఎస్కార్ట్, సహా కాన్వాయ్‌లోని మిగిలిన అధికారులంతా సీఎం వచ్చే వరకు రాజ్‌భవన్ బయట వేచిఉన్నారు.
ఇవీ చదవండి: