ETV Bharat / city

ప్రధాని మోదీకి.. సీఎం జగన్ లేఖ! - భోగాపురం ఎయిర్​పోర్టుపై సీఎం జగన్​కు ప్రధాని లేఖ

భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని తర్వితగతిన చేపట్టాలని కోరుతూ.. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా లేఖలు రాశారు. ఎన్​వోసీ లేని కారణంగా నిర్మాణ పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు తక్షణమే సైట్ క్లియరెన్స్ అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రధాని సీఎం జగన్ లేఖ
ప్రధాని సీఎం జగన్ లేఖ
author img

By

Published : Feb 25, 2022, 7:09 PM IST

భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని తర్వితగతిన చేపట్టాలని కోరుతూ.. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా లేఖలు రాశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి విస్తరణకు కేంద్ర సహకారం అందిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నట్లు సీఎం లేఖలో వివరించారు.

ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో విస్తరణ, రాకపోకలు పెంచేందుకు భౌగోళిక ఇబ్బందులు ఉన్నాయని.., ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్​పోర్టును త్వరితగతిన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సైట్ క్లియరెన్సు అనుమతిని తిరిగి పునరుద్ధరించాలన్నారు. ఈ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు భాగస్వామిని ఏపీ గుర్తించిందని తెలిపారు. ఎన్​వోసీ లేని కారణంగా నిర్మాణ పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని త్వరితగతిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు తక్షణమే సైట్ క్లియరెన్స్ అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ కీలకపాత్ర పోషిస్తోందని.., పర్యటక కేంద్రంగా, పారిశ్రామికంగా ఈ నగరం నుంచి విమాన రాకపోకలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఉందని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరారు.

ఇదీ చదవండి

ఉక్రెయిన్​లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు- ఫ్రీగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.