అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోరుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని జగన్ పేర్కొన్నారు. అదే చార్జ్ షీట్ లో రెండో నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తనను తొలగించాలని కోరుతూ డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సెప్టెంబరు 3 కు వాయిదా పడింది. పెన్నా కేసులో జగన్ డిశ్ఛార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా ఛార్జ్ షీట్ లో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ.రాజగోపాల్ డిశ్ఛార్జ్ పిటిషన్లపై విచారణ సెప్టెంబరు 1కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
ఇదీచదవండి.: INDIRA PARK: "ఇచట పెళ్లికాని జంటలకు అనుమతిలేదు".. బోర్డు తొలగింపు