ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లనున్నారు. సతీమణి భారతి, కుమార్తెలతో కలిసి ఇవాళ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి హైదరాబాద్ మీదుగా హిమాచల్‌లోని షిమ్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తన వివాహ రజతోత్సవ వేడుకల్ని జరుపుకునేందుకు ఆయన కుటుంబంతో కలిసి ఈ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకూ ఆయన కుటుంబంతో అక్కడ గడుపనున్నారు. సెప్టెంబరు 1న ఆయన ఏపీకి తిరిగి వస్తారు.
ఇదీ చదవండి: Yanamala: కేసుల మాఫీ కోసం రాష్ట్ర హక్కులు తాకట్టుపెట్టారు: యనమల