ETV Bharat / city

ఎవరో ఆర్డర్లు రాసిస్తే.. ఈయన చదువుతున్నారంతే: సీఎం - చంద్రబాబుపై జగన్ ఫైర్ న్యూస్

ఎన్నికలు వాయిదాపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి... తెదేపాపై విమర్శలు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్ధేశపూర్వకంగా నిలిపివేయించారని ఆరోపించారు. వైకాపా జోరు చూసే.. తెదేపాకు భయ పట్టుకుందని వ్యాఖ్యానించారు.

ఎవరో ఆర్డర్లు రాసిస్తే.. ఈయన చదువుతున్నారంతే: సీఎం

author img

By

Published : Mar 15, 2020, 5:34 PM IST

ఎవరో ఆర్డర్లు రాసిస్తే.. ఈయన చదువుతున్నారంతే: సీఎం

ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చదివి వినిపిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. సీఎస్‌, హెల్త్ సెక్రటరీని కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో వైద్యఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో సెక్రటరీని అడగాలి కదా అని పేర్కొన్నారు. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తీసుకొచ్చిన మనిషి అయినంత మాత్రాన ఇంత వివక్ష చూపుతారా? జగన్ ప్రశ్నించారు.

'తనకున్న బలంతో చంద్రబాబు అన్ని వ్యవస్థలను దిగజార్చుతున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. తనను గెలిపించలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు నిలిచిపోతే చంద్రబాబుకు కలిగే ప్రయోజనం ఏమిటీ?. చంద్రబాబు చర్యల వల్ల అంతిమంగా ప్రజలకు, రాష్ట్రానికే నష్టం కలుగుతోంది. చంద్రబాబు వైఖరి గురించి గవర్నర్‌కు వివరించాం. ఇప్పటికైనా చంద్రబాబు మారకపోతే విషయాన్ని పైస్థాయికి తీసుకెళ్తాం'. అని జగన్ వ్యాఖ్యానించారు.

గొడవలు సహజమే

ఎంపీటీసీ, జడ్పీటీసీ కలిపి 10,243 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి.. మొత్తంగా రాష్ట్రంలో 50 వేల చోట్లకు పైగా నామినేషన్ల ప్రక్రియ జరిగిందని తెలిపారు. నామినేషన్లప్పుడు 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయని.. స్థానిక ఎన్నికల్లో చిన్నచిన్న గొడవలు జరగటం సహజమని అభిప్రాయపడ్డారు. గతంలో ఇంతకంటే ఎక్కువ గొడవలే జరిగాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.