ETV Bharat / city

CM Jagan Birthday Celebrations: క్యాంపు కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు..శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, అధికారులు.. - క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన సీఎం

CM Jagan Birthday Celebrations: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసాదాన్ని తితిదే ఈవో జవహర్ రెడ్డి అందించారు. పండితులు వేదాశీర్వచనం అందించి అక్షితలు చల్లారు. మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

CM Jagan Birthday Celebrations
క్యాంపు కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Dec 21, 2021, 12:28 PM IST

Updated : Dec 21, 2021, 5:38 PM IST

క్యాంపు కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు

Ministers Birthday Wishes to CM Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మంత్రులు అధికారులు క్యాంపు కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి , బొత్స, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస రావు, బాలినేని, ఆదిమూలపు సురేష్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సీఎంఓ కార్యాలయ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం , ఆదిత్యనాధ్ దాస్, తదితరులు సీఎంకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి : CM Jagan Kadapa tour: సొంత జిల్లాకు సీఎం జగన్.. 3 రోజులపాటు పర్యటన

Sajjala Celebrated CM Jagan Birthday : రాష్ట్రంలో ప్రజలందరికీ ఆర్ధిక, సామాజిక భద్రత అందించేలా పథకాలను వైకాపా ప్రభుత్వం అందిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ జన్మదినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బాణా సంచా కాల్చి కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం వైకాపాదని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల ఫలితాలన్నీ ప్రజలకు తెలుసు అందుకే వారంతా ప్రజల వెనకున్నారని ఆయన అన్నారు. నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎన్నికల నాటికి ఇవి మరింత పెరుగుతాయని సజ్జల వ్యాఖ్యానించారు. సుభిక్షంగా జరిగే ఈ పాలన వందేళ్లపాటు కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి సహా ఇతర నేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండి : Chandrababu Wishes to CM Jagan: సీఎం జగన్​ బర్త్​ డే.. చంద్రబాబు ట్వీట్

CM Jagan Birthday Celebrations : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసాదాన్ని తితిదే ఈవో జవహర్ రెడ్డి అందించారు. పండితులు వేదాశీర్వచనం అందించి అక్షితలు చల్లారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారుల మధ్య సీఎం జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి :

PM WISHES TO CM JAGAN: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Last Updated : Dec 21, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.