ETV Bharat / city

ఈ ఏడాది జెండర్‌ బడ్జెట్‌ విధానం: సీఎం జగన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఈ ఏడాది జెండర్‌ బడ్జెట్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

gender budget in Andhra Pradesh
జెండర్‌ బడ్జెట్
author img

By

Published : Mar 9, 2021, 7:05 AM IST

రాష్ట్రంలో ఈ ఏడాది జెండర్‌ బడ్జెట్‌ (లింగ ఆధారిత) విధానాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ‘మహిళల కోసం ఎంత ఖర్చు చేయబోతున్నామో బడ్జెట్‌ ద్వారా చెబుతాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. దేశంలో ఇంతవరకు ఇలాంటిదెక్కడా జరగలేదు. పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా సక్రమంగా అమలవడం లేదు. చివరికి సచివాలయంలోనే లేదు. వెంటనే అక్కడ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిస్తున్నా. మిగిలిన చోటా ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ‘దిశ పెట్రోలింగ్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మహిళా కానిస్టేబుళ్లకు 900 స్కూటీలను పంపిణీ చేస్తున్నాం. దిశ కేసుల్ని వేగంగా దర్యాప్తు చేసేందుకు 18 స్టేషన్లకు.. అన్ని రకాల సౌకర్యాలు, పరికరాలతో కూడిన 18 వాహనాలను ఇస్తున్నాం. ఠాణాల్లో మహిళా సహాయ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం’ అని సీఎం వివరించారు.

ఒక్కొక్కరికి రూ.7-10 లక్షల ఆస్తిని కల్పించాం

‘ప్రభుత్వ ఉద్యోగినులకు అదనంగా అయిదు ప్రత్యేక సెలవులు ఇస్తున్నాం. ఇళ్లస్థలాలు, పట్టాలు, అమ్మఒడి, ఆసరా, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా కానుక, చేయూత తదితర పథకాల ద్వారా 21 నెలల్లో రూ.80 వేల కోట్లను మహిళల చేతిలో పెట్టాం. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలనూ లెక్కలోకి తీసుకుంటే.. ఒక్కో మహిళకు నేరుగా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తిని కల్పించినట్లవుతుంది’ అని పేర్కొన్నారు.

అప్పటి వారి మాటలు ఆశ్చర్యం కల్గించాయి

‘నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ‘కోడలు మగపిల్లాడ్ని కంటానంటే.. అత్త వద్దంటుందా’ అంటూ సీఎం స్థానంలోని వ్యక్తి మాట్లాడారు. కారు షెడ్డులో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలని అప్పట్లో సభాపతి స్థానంలో ఉన్న వారు కూడా అన్నారు. మనం మహిళలపై ఎలాంటి గౌరవం చూపిస్తామో.. సమాజమూ అలాగే చూపిస్తుందనే కనీస ఆలోచన లేకుండా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు మారాలి’’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

మహిళా కానిస్టేబుళ్లతో మాట్లాడిన సీఎం

ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోని మహిళా డెస్క్‌ కానిస్టేబుల్‌ అలేఖ్య, కర్నూలు టూటౌన్‌ మహిళా డెస్క్‌ కానిస్టేబుల్‌ దుర్గతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మహిళా మంత్రులతో కేక్‌ కట్‌ చేయించారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రూపొందించిన ‘దేశానికే దిశ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్ధినులకు శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీకి సంబంధించి స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించి.. పోస్టర్లను ఆవిష్కరించారు. ఏఎన్‌ఎం శాంతి, పారిశుద్ద్య కార్మికురాలు మాబున్ని, మహిళా కానిస్టేబుల్‌ సరస్వతి, వాలంటీర్‌ కల్యాణిని సీఎం సత్కరించారు.

‘స్వేచ్ఛ’ పథకం అమలుకు ఉత్తర్వులు

కిశోర బాలికలు, మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ పంపిణీకి ఉద్దేశించిన స్వేచ్ఛ పథకం అమలుకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులనిచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంనుంచి ఈ పథకం కింద 7 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, ఆశ్రమ విద్యాలయాల్లోని విద్యార్థినులకు ఉచితంగా న్యాప్‌కిన్స్‌ అందిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేయూత దుకాణాల్లో తక్కువ ధరకు నాణ్యమైన న్యాప్‌కిన్స్‌ అందుబాటులో ఉంచుతారు.

ఇదీ చూడండి:

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేక చర్యలు: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.