ETV Bharat / city

Jagananna house: రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్‌

author img

By

Published : Jun 3, 2021, 12:05 PM IST

Updated : Jun 3, 2021, 2:56 PM IST

రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇళ్లు లేని నిరుపేద ఎక్కడా ఉండకూడదన్నదే లక్ష్యమని.. దీన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని.. వారు సొంతిళ్లు నిర్మించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. రెండు దశల్లో 28 లక్షల మంది సొంతిళ్లు నిర్మాణం చేసుకునేలా యుుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్‌

ఇంటి నిర్మాణం చేసుకుంటోన్న వారికి ప్రభుత్వం ఉచిత ఇసుక (sand) అందించడం సహా తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రిని అందిస్తామని సీఎం జగన్(CM Jagan) స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతరంగా చేపడతామన్న సీఎం.. దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లో పట్టా మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాకో జేసీని(JC) నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో తొలిదశలో ఇళ్ల నిర్మాణాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో సీఎం ప్రారంభించారు. అన్ని జిల్లాల ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలు ఎక్కడా ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. దీనికోసం అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‌ చేయించామన్నారు. ఎప్పుడూ కనివినీ ఎరుగని రీతిలో పేదవాడికి సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాల్లో మొదటిదశ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.

జూన్‌ 10 వరకూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పునాదులు వేసే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా, ఆ ఇళ్లపట్టాలు సహా.. ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 2 దశల్లో ఇళ్ల కార్యక్రమం చేపడుతున్నట్లుు సీఎం తెలిపారు. మొదటిదశలో 16 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, వచ్చే ఏడాది జూన్‌ కల్లా పూర్తి చేస్తామన్నారు.

రెండో దశను వచ్చే ఏడాది జూన్​లో మొదలుపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. రెండుదశల్లో కలిపి 28 లక్షలకు పైగా ఇళ్లను 2023 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి 50 వేల 944 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఏకంగా 17వేల కాలనీలు కొత్త ఇళ్ల నిర్మాణం ద్వారా వస్తున్నాయన్న సీఎం.. మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు.. పట్టణాలని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు ఉందని, ప్రభుత్వం 30 లక్షల ఇళ్లస్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసిందన్నారు. ఇంటికి నలుగురు చొప్పున ఉన్నారనుకుంటే దాదాపు కోటి 20 లక్ష ల మందికి మనం ఇళ్లు కడుతున్నామన్నారు. రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని, ఇంటి స్థలంతో పాటు అందిస్తున్నామన్నారు.

17 వేలకు పైగా వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. తాగునీరు పైపులైన్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సౌకర్యం, అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని, పార్కులు, విలేజ్‌ క్లినిక్​లు, గ్రామ సచివాలయాలు, స్కూళ్లు.. తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాలనీల్లో మొత్తం మౌలిక సదుపాయాలకోసం 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ఎక్కడాలేని విధంగా మంచి నాణ్యమైన, ప్రమాణాలున్న సదుపాయాలతో మంచి కాలనీలుగా తీర్చి దిద్దుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అగ్రకులాల్లోని పేదవారికి.. కాలనీలు పూర్తయ్యే సరికి 5 లక్షల నుంచి 10లక్షల వరకూ ఆస్తి సమకూరుతుందని సీఎం అన్నారు. ఇళ్లు మంజూరైన అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చిందని, ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును ఇచ్చామని, దీని ప్రకారం నిర్మాణాలు అవుతున్నాయన్నారు. గతంలో మాదిరిగా కాకుండా 340 చదరపు అడుగులకు ఇళ్ల సైజు తీసుకువచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక పురోగతి ప్రక్రియ పురోగతిలో ఉంటుందని సీఎం తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని 21.70 కోట్ల పనిదినాలు లభిస్తాయని, అనేక మందికి పనులు ఉపాధి లభిస్తుందన్నారు. 30 రకాల పనులు చేసేవారికి సొంత గ్రామాల్లోనే ఉపాధి దొరుకుతుందన్నారు.

ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామన్న సీఎం..ఆర్థిక భారం తగ్గించడానికి మార్కెట్‌ధర కన్నా... తక్కువ ధరకే ఇంటి నిర్మాణ సామగ్రిని అందిస్తామన్నారు.. సిమెంట్‌ను 225లకు తగ్గించి ఇస్తామని, స్టీలు రేట్లు తగ్గించి ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంకోసం 1.8 లక్షలు ...సదుపాయాల కల్పన కోసం ప్రతి ఇంటికీ లక్షన్నర ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. అర్హత ఉండీ.. పొరపాటున లబ్ధిదారుల జాబితాలో లేని వారు దరఖాస్తు చేస్తే 90 రోజుల్లో ఇంటి పట్టా అందిస్తామన్నారు.

ఇళ్ల నిర్మాణం ప్రక్రియ వేగంగా, విజయవంతంగా ముందుకు సాగడానికి జిల్లాకో జేసీని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు జిల్లాల్లో ఉన్న ముగ్గురు జేసీలు కాకుండా అదనంగా నాలుగో జేసీగా ఐఏఎస్‌ అధికారిని గృహనిర్మాణంకోసం నియమిస్తున్నామన్నారు. కొంతమంది దుర్బుద్ధితో కోర్టుల్లో కేసులు వేయడం వల్ల 3లక్షల 74 వేల అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయలేకపోతున్నామన్న సీఎం.. కోర్టులకు సెలవులు పూర్తైన అనంతరం దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని పరిష్కరించడం ద్వారా 3.74లక్షల మందికి న్యాయం చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య చుక్కల మందు పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ

Last Updated : Jun 3, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.