విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. లలితా త్రిపుర సుందరిదేవి అలంకారంలోని దుర్గమ్మను హైకోర్టు సీజే జస్టిస్ గోస్వామి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో భ్రమరాంబ సీజే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాగా.. దసరా ఉత్సవ శోభతో ఇంద్రకీలాద్రి విరాజిల్లుతోంది. నేడు లలితా త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు కనకదుర్గమ్మ దర్శనమిస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. శరన్ననవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మేళతాళాలు, డప్పు వాద్యాల మధ్య నగరోత్సవం సాగింది. ఉత్సవమూర్తులను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: