తితిదేలో అటవీ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 30 ఏళ్లుగా సర్వీసు ఉన్న కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా.. నేటికీ అమలు కాలేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ అన్నారు. 556 రోజులుగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నా.. తితిదే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను లక్ష్మి శ్రీనివాస అనే ప్రైవేటు కార్పొరేషన్లో విలీనం కావాలని ఒత్తిడి చేస్తున్నారని.. దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి: తితిదే అటవీ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా శ్రీకాకుళంలోని డైమండ్ పార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నందున అటవీ కార్మికులకు టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులప పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: