లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసపున్నయ్య మైదానంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ నాయకుడు శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ , ఆప్ నాయకులు, ముస్లిం నాయకులు హాజరయ్యారు. పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టకూడదని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా కోరారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో చెప్పింది ఇదేనా అని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా భాజపా, ఆరెస్సెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలో అందరూ సమానమే అన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్ట సవరణ సరైన విధానం కాదని స్పష్టం చేశారు. 'మోదీ, అమిత్ షా ఏమైనా చేయండి... కానీ దేశాన్ని విభజించి పాలించవొద్దు' అని ఆయన అన్నారు.
'మతంతో పౌరసత్వాన్ని ముడిపెట్టొద్దు' - డి.రాజా వార్తలు
మతంతో పౌరసత్వాన్ని ముడిపెట్టొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా కోరారు. రాజ్యాంగం దేశప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చిందన్నారు. విజయవాడలో ఓ సభకు హాజరైన ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.