అగ్రిగోల్డ్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన 3 లక్షల 59 వేల 655 మంది డిపాజిటర్లకు... 264 కోట్ల రూపాయలను గత సంవత్సరం నవంబర్ 1వ తేదీనే ప్రభుత్వం చెల్లించిందని సీఐడీ వెల్లడించింది. మొత్తం 1150 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించడం కోసం ప్రభుత్వం 2019 అక్టోబర్ 25న నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. తొలి విడతలో పదివేల రూపాయల పరిహారం కొద్ది మందికి అందలేదన్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి గత అక్టోబర్‌లోనే.. పదివేల రూపాయలలోపు డిపాజిటర్లకు, ఇరవై వేల రూపాయల డిపాజిటర్లకు చెల్లింపులు జరపాలని ఆదేశించినట్లు ప్రకటనలో సీఐడీ పేర్కొంది.
ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు నివేదించినట్లు తెలిపింది. 20 వేల రూపాయల డిపాజిట్ల పంపిణీకి విధివిధానాల కోసం హై కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సీఐడీ పేర్కొంది. ఆదేశాలు రాగానే.. గతంలో చెల్లింపులు జరగని.. పదివేల రూపాయల డిపాజిటర్లకు కూడా చెల్లింపులు జరుగనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: