సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితమంతా అబద్ధాలు, మోసాలేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలనే.. ముఖ్యమంత్రి అయ్యాకా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్కు సలహాలు ఎవరిస్తున్నారో తెలియదుగానీ, అంతిమంగా నష్టపోయేది ఆయనేనని అయ్యన్నపాత్రుడు అన్నారు.
విజయసాయిరెడ్డి శకుని లాంటి వారని.. శకుని సలహాలు విన్నవారెవరూ బాగుపడలేదని విమర్శించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం పేరుతో, ప్రకటనల ముసుగులో రైతులను జగన్ దారుణంగా మోసగిస్తున్నాడని ఆరోపించారు. లక్ష రూపాయలు అంతకులోపు రుణం తీసుకొని, సకాలంలో చెల్లించినవారికే సున్నావడ్డీ అమలవుతుంది షరతు పెట్టడం తగదన్నారు. 18నెలల పాలనలో ప్రజలకు ఏంచేశారో జగన్ ఒక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే మంచిదని హితవుపలికారు.
ఇవీ చదవండి..