ETV Bharat / city

'జగన్ కక్ష సాధింపులకు పోలీసులు దోషులవుతున్నారు' - 'జగన్ కక్ష సాధింపులకు పోలీసులు దోషులవుతున్నారు'

ప్రతిపక్షాలపై సీఎం జగన్ కక్షసాధింపులకు పోలీసులు దోషులుగా నిలడబాల్సి వస్తోందని మాజీమంత్రి చినరాజప్ప ఆరోపించారు. వైద్యుడు సుధాకర్​పై వైకాపా ప్రభుత్వం పోలీసుల చేత చేయించిన దౌర్జన్యానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టని ధ్వజమెత్తారు

'జగన్ కక్ష సాధింపులకు పోలీసులు దోషులవుతున్నారు'

author img

By

Published : May 22, 2020, 6:50 PM IST

వైద్యుడు సుధాకర్​పై జగన్ ప్రభుత్వం పోలీసుల చేత చేయించిన దౌర్జన్యానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ధ్వజమెత్తారు. అమానవీయంగా దౌర్జన్యం చేసిన విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించడం సంతోషదాయకమన్నారు. గతంలో విశాఖ పోలీసులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్​ను హైకోర్టు మందలించినా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. వైకాపా ప్రభుత్వం చేసే కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థ చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.