కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్, క్వారంటైన్‌ని ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. నిత్యావసర వస్తువులను ప్రభుత్వం వాలంటీర్లతో పంపిణీ చేయిస్తామన్న అంశాన్ని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ విషయంపై గర్వంగా చెప్పుకొంటున్నా.. ఎక్కడా అమలవడం లేదని తప్పుబట్టారు. కొన్ని చోట్ల వైకాపా నేతలు వస్తే గానీ రేషన్ దుకాణాలు తెరవడం లేదని ఆరోపించారు. డెల్టాలో సాగునీటి కొరత ఉందన్న చినరాజప్ప.... అధికారులు పట్టించుకోవాలన్నారు.
ఇవీ చదవండి: