ఆలయాల పరిరక్షణ కోసం...ధార్మిక పరిషత్తును సత్వరమే ప్రకటించాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పీఠాల ధర్మాచార్యులు..ఈ పీఠానికి నేతృత్వం వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాల ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న ధర్మపరిరక్షణ యాత్రలో భాగంగా విద్యాశంకరభారతి విజయవాడ లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.
దేవాలయాల్లో విధ్వంసం దుర్మార్గమన్న స్వామిజీ...ఈ దుశ్చర్యలు యావత్తు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయన్నారు. ఆలయాల పరిరక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.